JEE exams: మే 18 న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! 1 d ago
2025-26 విద్యా సంవత్సరానికి గాను బీటెక్, బీఆర్క్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను వచ్చే ఏడాది మే 18 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అందులో పరీక్ష కాలపట్టిక, సిలబస్‌లను పొందుపరిచింది. ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి జేఈఈ మెయిన్స్‌లో కనీస మార్కులు పొందిన 2.50 లక్షల మంది విద్యార్దులు మాత్రమే అర్హులు. ఏప్రిల్ 17 నాటికి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత నుండి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.